100 కోట్లు దాటిన ‘సైరా’.. తెలుగులో నాన్ బాహుబలి-2 రికార్డ్స్

Published on Oct 9, 2019 11:40 am IST

ఊహించినట్టే ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. మొదటి వారం ముగిసేసరికి
తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 1’తో పాటు పలు సినిమాల రికార్డులు బద్దలుకొట్టి నాన్ బాహుబలి-2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల పైగానే షేర్ వసూలు చేసిందీ సినిమా.

ఇక ఏపీ, తెలంగాణలో అయితే రూ.84 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ వసూళ్లలో నెంబర్ 2గా నిలిచింది. అన్ని ఏరియాల్లో రికార్డ్ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా ఇప్పటికే 78 శాతం రికవర్ అయింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణల్లో పూర్తి రికవరీ సాధించడం, రూ.100 కోట్ల మార్క్ తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వసూళ్లతో చిరు తన చరీష్మా ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More