శనివారమే దుమ్మురేపిన ‘సైరా’.. ఆదివారం ఆగుతాడా !

Published on Oct 13, 2019 11:03 am IST

‘సైరా’ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏమిటో రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు నుండే సంచలనాలకు తెరలేపిన చిరు ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు. మిగతా స్టార్ హీరోలంతా కలెక్షన్స్ పుల్ చేయడంలో మొదటి వారం రోజులకే పరిమితమవుతుండగా చిరు మాత్రం 11వ రోజు కూడా మంచి రన్ చూపిస్తున్నారు.

10వ రోజు ఏపీ, తెలంగాణల్లో రూ.2.10 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’ నిన్న శనివారం 11వ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ వలన రూ.2.73 కోట్ల షేర్ అందుకుంది. దీంతో టోటల్ టెన్ డేస్ షేర్ రూ.97 కోట్లు దాటింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో 11 రోజులకుగాను రూ.29.7 కోట్లకు చేరి ఈరోజుతో రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోనుంది.

శనివారమే వసూళ్లలో మంచి జంప్ చూపిన చిత్రం ఈరోజు ఆదివారం ఖచ్చితంగా మరింత మెరుగ్గా పెర్ఫార్మ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More