‘సైరా’ నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Mar 5, 2019 11:09 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కాగా చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీ సెట్ లో షూట్ చేస్తోంది.

ఈ షూట్ లో చిరంజీవి మరియు జగపతి బాబు కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కానుంది. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయితే చివరి షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. చివరి షెడ్యూల్ లో సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతుంది.

ఇక ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More