అన్ని లీగల్ ప్రాబ్లమ్ అధిగమించిన సైరా…,రేపు విడుదల ఖాయమే.

Published on Oct 1, 2019 3:55 pm IST

సైరా నర్సింహారెడ్డి చిత్ర విడుదలకు తెలంగాణా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతి రెడ్డి మొదట బయోపిక్ అని ఇప్పుడు చరిత్రను వక్రీకరిస్తూ సైరా తెరకెక్కించారని..,కనుక సైరా విడుదల నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై స్పందించిన హై కోర్ట్ సైరా చిత్రం లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సినిమా ను కేవలం వినోద సాధనంగా పరిగణించాలన్న హైకోర్టు ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవ్వరు చూపించరు అని స్పష్టం చేసింది.

దీనికి ఉదాహరణగా గతంలో గాంధీజీ,మొగల్ చరిత్రల ఆధారంగా తెరకెక్కిన కొన్ని చిత్రాలను ప్రస్తావించింది. ఇప్పుడు సినిమాను తాము అపలేమన్న హైకోర్టు
సైరా నర్సింహారెడ్డి విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. దీనితో సైరా విడుదలకు మార్గం సుగమం ఐయ్యింది. ఇక రేపు సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఐదు భాషలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More