వంద కోట్ల క్లబ్ లో సైరా నరసింహారెడ్డి

Published on Oct 8, 2019 4:20 pm IST

సైరా నరసింహారెడ్డి వందకోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం సైరా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఆరు రోజులకు గానూ 76.5 కోట్ల షేర్ వసూళ్లుసాధించింది . ఇక మిగతా అన్నిభాషలలో కలిపి మరో 28కోట్ల షేర్ వసూళ్లతో మొత్తంగా 104కోట్ల వసూళ్లకు చేరినట్టు తెలుస్తుంది. దసరా పండుగ సెలవులను ఈ మూవీ బాగానే సద్వినియోగం చేసుకుంది.

ఐతే హిందీ చిత్రం వార్ మరియు హాలీవుడ్ మూవీ జోకర్ సైరా కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపించాయి. ఆ రెండు చిత్రాల నుండి భారీ పోటీని ఎదుర్కొన్న సైరా కొన్ని ఏరియాలలో కలెక్షన్స్ కోల్పోయింది. ఇక నేడు పండుగ దినం కావడంతో ఇంకొంత మెరుగైన వసూళ్లు సైరా ఖాతాలో చేరే అవకాశం కలదు. ఐతే రేపటి నుండి వర్కింగ్ డేస్ కావడంతో సైరా కు అసలు పరీక్ష మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

X
More