సైరా షూటింగ్ అప్డేట్ !

Published on Apr 19, 2019 3:30 pm IST

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా . ఈచిత్రం యొక్క చివరి షెడ్యూల్ ప్రస్తుతం కేరళలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ చిరు తోపాటు బ్రహ్మజి, యంగ్ యాక్టర్ చరణ్ దీప్ తదితరులు పాల్గొంటున్నారు. 10రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత ప్యాచ్ వర్క్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయాన్ని కేటాయించనున్నారు.

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా అమితాబ్ , విజయ్ సేతుపతి , సుధీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.అమిత్ త్రివేది అందిస్తున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :