కేరళ ఫారెస్ట్ లో సైరా !

Published on Apr 16, 2019 9:02 am IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం కేరళ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. సుమారు 10రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత హైదరాబాద్ లో మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ చిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తరువాత విఎఫ్ఎక్స్ కోసం చాలా సమయాన్ని కేటాయించనున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :