సైరా యూఎస్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Oct 5, 2019 7:41 am IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి ఈ నెల 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిత్రంకు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. మూవీ పై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ కలెక్షన్స్ కూడా సైరా సత్తా చాటుతుంది.

ప్రీమియర్స్ కలెక్షన్స్ ద్వారానే ఒక మిలియన్ కి పైగా వసూళ్లు సాధించిన సైరా శుక్రవారం కడపటి సంచారం ప్రకారం యూఎస్ లో $1.48 మిలియన్ కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. దీనితో సైరా కేవలం మూడురోజులలో $1.5 మిలియన్స్ కి చేరువైంది.

చిరంజీవి మొదటిసారి ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించిన సైరా చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా హీరో రామ్ చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రలు చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More