ఇండియన్ ఆడియెన్స్ ని సినిమా ఎలానో క్రికెట్ ని కూడా అంతే రీతిలో ఒకరకంగా అంతకు మించే ఆరాధిస్తారు. ఇలా ప్రస్తుతం ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్స్ నేడు అహ్మదాబాద్ లో నరేంద్రమోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ మరియు మన భారత్ జట్టు నడుమ జరిగింది.
గత మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఇచ్చిన భారీ టార్గెట్ తరహాలోనే ఈసారి కూడా మనవాళ్ళు కివీస్ జట్టుపై విరుచుకుపడ్డారు. ఫామ్ లో లేడు అనుకున్న అభిషేక్ శర్మ మొదలుకొని, సంజూ సామ్సన్, శివమ్ దూబేల వీరోచిత ఇన్నింగ్స్ 250కి పైగా పరుగులు సాధించి పెట్టాయి. ఈ భారీ టార్గెట్ తో దిగిన కివీస్ తో మ్యాచ్ ఎలా ఉంటుందా అని చూసిన వీక్షకులకి భారత్ జట్టు వార్ వన్ సైడ్ చేసి చూపించారు.
అర్ష దీప్ కట్టడి బుమ్ర వరుస వికెట్లు, పటిష్టమైన టీం వర్క్ దాదాపు 100 పరుగులకి పైగా మార్జిన్ తో భారత్ కి మరోసారి వరల్డ్ కప్ ని తెచ్చిపెట్టి హోమ్ గ్రౌండ్ లో మొట్ట మొదటిసారిగా వరల్డ్ కప్ సొంతం చేసుకున్న మొదటి జట్టుగా చరిత్ర సృష్టించేలా చేసాయి. దీనితో భారతదేశం అంతటా సందడి వాతావరణం ఇపుడు నెలకొంది.
