నిర్మాతగా తాప్సి.. తొలి సినిమా ఏదంటే?

Published on Jul 16, 2021 3:05 am IST


సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను కొత్త అవతారమెత్తింది. తెలుగులో, తమిళంలో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే వరుస సినిమాలతో బీజీ బిజీగా గడుపుతుంది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలోని నటీ నటులంతా నటులుగా ఉంటూనే దర్శకులుగా, నిర్మాతలుగా కొత్త బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే తాప్సీ కూడా ఇప్పుడు నిర్మాతగా మారిపోయారు.

అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన తాప్సీ తాను ఇండస్ట్రీకి వచ్చి గత ఏడాదితోనే పదేళ్లు పూర్తయ్యిందని, నా ప్రయాం ఇంతవరకు కొనసాగుతుందని నేనెప్పుడు ఊహించలేదని, పబ్లిక్‌ ఫిగర్‌ అవుతానని అనుకోలేదని చెప్పుకొచ్చింది. నాపై ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికి రుణపడి ఉంటానని, ఇకపై నటిగానే కాకుండా నిర్మాతగా కొత్త మార్గం వైపు అడుగులు వేస్తున్నా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరింది. నా ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు ‘ఔట్‌ సైడర్‌ ఫిలిమ్స్‌’ అని, నా స్నేహితుడు ప్రాంజల్‌తో కలిసి దీనిని స్థాపించినట్టు తాప్సీ చెప్పుకొచ్చింది.

జీ స్టూడియోస్‌తో కలిసి ‘బ్లర్‌’ అనే సినిమాను నిర్మించబోతున్నానని, ఇందులో తాను లీడ్ క్యారెక్టర్‌ చేయనున్నానని, అజయ్‌ బెహల్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారని అన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవాలనుకునే పట్టుదల ఉన్న వారికి మా ప్రొడక్షన్‌ హౌస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని తాప్సీ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :