‘కాంచన 2’గా మారిన తాప్సీ హారర్ సినిమా.

‘కాంచన 2’గా మారిన తాప్సీ హారర్ సినిమా.

Published on Feb 23, 2015 9:28 PM IST

muni-3
ప్రముఖ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రాఘవ లారెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాకు టైటిల్ మారింది. సూపర్ హిట్ హారర్ కామెడీ ‘ముని’ ఫ్రాంచైజ్ సిరీస్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. మొదట ‘గంగ – ముని 3’ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు ‘కాంచన’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘కాంచన 2’ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శక హీరో రాఘవ లారెన్స్, నిర్మాతలు భావించారు.

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. నిత్యా మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. చాలా రోజుల నుండి ల్యాబ్ కు పరిమితమైన ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు