‘గేమ్ ఓవర్’ మూవీతో తాప్సి కి జ్ఞానోదయం

Published on Jun 19, 2019 12:46 pm IST

తాప్సి ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “గేమ్ ఓవర్”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన తెలుగు,తమిళ భాషల్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈనెల 14న విడుదలైన “గేమ్ ఓవర్” కలెక్షన్స్ అన్నిచోట్లా స్టడీగా కొనసాగుతున్నాయి. దీనితో పాటు విడుదలైన చిన్న చిత్రాలు అంతగా మెప్పించకపోవడంతో పోటీ లేని ‘గేమ్ ఓవర్’ మంచి వసూళ్లను సాధిస్తుందని చెవుతున్నారు.

ఈ చిత్ర విజయంపై స్పందించిన తాప్సి, “ఒక మంచి సినిమా ఇచ్చిన విజయానుభవం ఎంతో స్ఫూర్తి దాయకం. మనం చేయాల్సిందల్లా మంచి సినిమా తీయడమే, ఇక తరువాత దాన్ని పెద్ద విజయంవైపుగా ప్రేక్షకులే నడిపిస్తారు” అని ట్వీట్ చేశారు. ‘గేమ్ ఓవర్’ మూవీతో ప్రజల నాడి, విజయానికి దారి తెలుసుకున్న తాప్సి భవిష్యత్తులో ఎన్ని విజయాలు సాధిస్తుందో చుడాలిమరి.

సంబంధిత సమాచారం :

More