రానా -సాయి పల్లవి ల సినిమాలో సీనియర్ నటి !

Published on Mar 30, 2019 4:38 pm IST

శ్రీ విష్ణు తో ‘నీది నాది ఒకే కథ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకులను మెప్పించాడు దర్శకుడు వేణు ఊడుగుల. ఇక ఈ చిత్రం తరువాత మరోసారి వైవిధ్యమైన కథ తో రానున్నాడు. రానా , సాయి పల్లవి జంటగా వేణు ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటించనుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. ఇక వీరితో పాటు సీనియర్ హీరోయిన్ టబు మానవ హక్కుల నేతగా నటించనుందని టాక్.

1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘విరాట పర్వం 1992’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈచిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారనే విషయం తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :

More