ఇంటర్వ్యూ : నిర్మాత ఠాగూర్ మధు – ‘పందెంకోడి’కి ఈ సినిమా పర్ఫెక్ట్ సీక్వెల్ !

Published on Oct 15, 2018 2:43 pm IST

విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో అక్టోబర్ 18న విడుదల కానుంది. కాగా ఈ సందర్భంగా ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

‘పందెంకోడి’ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ సీక్వెలా ? లేక ఆ చిత్రంలోని పాత్రల ఆధారంగా ఈ ‘పందెంకోడి 2’ చిత్రాన్ని తెరకెక్కించరా ?

‘పందెంకోడి’ సినిమాకి ‘పందెంకోడి 2’ పర్ఫెక్ట్ సీక్వెల్ అనుకోవచ్చు. అంటే ఆ సినిమాలోని క్యారెక్టర్స్ బేస్ చేసుకొనే.. ఈ సినిమా ట్రీట్మెంట్ రాసుకోవడం జరిగింది. ఆ సినిమాలో ఉన్న బలమైన ఎమోషన్ ఈ సినిమాలో కూడా ఉంటుంది.

నిర్మాతగా మీరు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. అంత బిజీలో కూడా ఏ ఉద్దేశ్యంతో ఈ సినిమాని తీసుకున్నారు ?

బేసిక్ గా నేను ‘పందెంకోడి’ సినిమాకి పెద్ద ఫ్యాన్ ని అండి. ఆ సినిమలోని హీరో క్యారెక్టర్ యూనిక్ క్యారెక్టర్. ఎందుకంటే జనరల్ గా ఏ సినిమాలోనైనా విలన్ కంటే హీరో చిన్నవాడై ఉంటాడు. కానీ ఈ సినిమాలో హీరో కంటే విలన్ చిన్నవాడు. ‘మొదట్లో ఇలాంటి పాయింట్ వర్కౌట్ అవుతుందా అప్పట్లో చాలామంది డౌట్ పడ్డారు. ఆ తర్వాత సినిమా రిజల్ట్ చూశాకా ఈ ‘పందెంకోడి’ సినిమా పై చాలామంది మేకర్స్ ఇంట్రస్ట్ చూపించారు.

ఈ సినిమా డైరెక్టర్ లింగు సామి గురించి చెప్పండి ?

‘పందెంకోడి’ సినిమా కంటే.. ఈ సీక్వెల్ ని లింగు సామి ఇంకా బాగా డీల్ చేశాడు. ఒక డైరెక్టర్ గా అతని కెరీర్ లో ఈ సినిమాకి బెస్ట్ వర్క్ ఇచ్చాడు. సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ ని చాలా డెప్త్ గా డిజైన్ చేసాడు. స్క్రిప్ట్ పరంగా ‘పందెంకోడి 2’ చిత్రం, ‘పందెంకోడి’ కంటే చాలా బెటర్ గా ఉంటుంది. సినిమా కథను చిన్న సంఘటన రూపంలో చెప్పుకుంటే.. ఎన్నో ఏళ్ల నుండి రెండు ఊరుల మధ్య పరిష్కారం దొరకని ఓ ప్రోబ్లమ్ ని.. హీరో ఎలా సాల్వ్ చేసాడనేది.. దర్శకుడు చాలా ఇంట్రస్టింగ్ గా నడిపాడు. సినిమాలో చక్కని డ్రామా కూడా బాగా కుదిరింది.

ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ల గురించి చెప్పండి ?

‘పందెంకోడి’ సినిమా విశాల్ కి చాలా ఎమోషనల్ ఫిల్మ్.. పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయిన ఫిల్మ్. సీక్వెల్ స్టార్ట్ అవ్వకముందు నుంచే .. ఈ సినిమా పై తనకి ఒక ప్రత్యేకమైన ఇంట్రస్ట్ ఉంది. అందుకే మనసు పెట్టి.. ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాడు. హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ కూడా చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్ కూడా డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. ఎవ్వరికి భయపడని ఎప్పుడూ అల్లరి చేసే అమ్మాయి. తను చేసే పనులు, చెప్పే సమాధానాలు కూడా ఆసక్తి కలిగించేలా ఉంటాయి.

‘పందెంకోడి 2’ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన పాత్ర.. కథకే చాలా ప్రధానమైనది. అంతటి కీలక పాత్రకు వరలక్ష్మీ న్యాయం చేశారా ?

ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. తను ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తెలుగు అర్ధం చేసుకొని మరి.. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అప్పటికే మేము చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్ లను ట్రై చేశాము. ఎవరు చెప్పినా ఆ పాత్ర తాలూకు గాంభీర్యం, ఎమోషన్ రావట్లేదు. చివరకి తను డబ్బింగ్ చెప్పాకా ఆ పాత్ర సినిమాలో ఇంకా బాగా ఎలివేట్ అయింది.

ఎన్టీఆర్ ని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం ‘టెంపర్’. అ సినిమాని ఇప్పుడు మీరు తమిళంలో విశాల్ తో తెరకెక్కిస్తున్నారు. ఎలా వస్తోంది ? సేమ్ ఒరిజినల్ ని ఫాలో అవుతున్నారా లేక స్క్రిప్ట్ లో మార్పులు ఏమైనా చేశారా ?

పెద్దగా మార్పులు ఏమి చెయ్యలేదు. కాకపొతే తమిళ్ నేటివిటీకి తగిన విధంగా అక్కడక్కడ రెండు మూడు సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చెయ్యటం జరిగింది. సినిమా చాలా బాగా వస్తోంది. తెలుగులో లాగే, తమిళంలో కూడా టెంపర్ రీమేక్ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

‘పందెంకోడి 2’ చిత్రాన్ని మీరు ఆల్ రెడీ చూసే ఉంటారు. సినిమా చూసాక మీకెలా అనిపించింది ?

మొన్నే మా టీమ్ తో కలిసి చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ‘పందెంకోడి 2’. ఖచ్చితంగా అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

సంబంధిత సమాచారం :