గెస్ట్ రోల్ లో స్టార్ హీరో కుమారుడు !

Published on Apr 2, 2019 10:00 am IST

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఫొటోలు వారానికి ఒక్కసారైనా నెట్ లో దర్శనమిస్తాయి. అంతలా పాపులర్ అయ్యాడు ఈ చిన్నోడు. అతని వయసు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఇటీవల కేరళ లో తైమూర్ బొమ్మలను తయారుచేసి అమ్మారంటే అతని క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇక ఈ బుడుతుడు ఇప్పుడు సినిమాలో కనిపించనునున్నాడు. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం గుడ్ న్యూస్. ఈ సినిమాలో 10 నిముషాలు స్క్రీన్ ఫై కనిపించనున్నాడు తైమూర్. ఇప్పటికే అతను తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా పూర్తి చేశాడట.

సంబంధిత సమాచారం :