నానికి ఫ్రెండ్ గా టాలెంటెడ్ డైరెక్టర్ !

Published on Mar 21, 2021 9:48 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ ‌లో పోస్ట్ చేస్తూ ‘శ్యామ్ సింగ రాయ్’ లో తాను సహాయక పాత్ర పోషిస్తున్నానని వెల్లడించాడు. రాహుల్ సంకృతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి, మరియు కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ఈ చిత్రంలో రాహుల్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో చూడాలి. గతంలో, రాహుల్ మహేష్ బాబు యొక్క శ్రీమంతుడు చిత్రంలో సహాయక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.

కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :