బాలయ్యతో టాలెంటెడ్ డైరెక్టర్ సినిమా ?

Published on Aug 1, 2020 2:10 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ లేకపోయినా టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందువరుసలో ఉండే పేరు ‘ప్రవీణ్ సత్తారు’ది. రావాల్సిన అంతగా పేరు రాలేదు గాని, మంచి విషయం ఉన్న డైరెక్టర్. ‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ‘ప్రవీణ్ సత్తారు’కు పెద్ద హీరోల నుండి ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు. అయితే చాల టైం తీసుకుని నాగార్జునను ఒప్పించాడు. ప్రస్తుతం నాగార్జునతో సినిమా చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత ‘ప్రవీణ్ సత్తారు’ తన తరువాత సినిమాని బాలయ్యతో చేయబోతున్నాడని, ఇప్పటికే బాలకృష్ణతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది చివర్లో బాలయ్య – ‘ప్రవీణ్ సత్తారు’ కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందట. కమర్షియల్ ఫార్ములాకు అతీతంగా వైవిధ్యమైన సినిమాలను తీసే దర్శకుల్లో ‘ప్రవీణ్ సత్తారు’ ఒకరు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న బాలయ్య, పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More