రామ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ ఫిక్స్ ?

రామ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ ఫిక్స్ ?

Published on Apr 19, 2021 12:00 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో మొత్తానికి స్టార్ హీరోల హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం కరోనాతో క్వారంటెన్ లో ఉన్నాడు అనిల్. అయినా అనిల్ తరువాత సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా హీరో రామ్ – అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా రానుందని.. ఇప్పటికే వీరిద్దరూ కథ విషయమై సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. నిజానికి ఎప్పటినుండో వీరి కలయికలో సినిమా వస్తోంది అంటున్నారు.

కాగా వచ్చే ఏడాది దాదాపు వీరి కలయికలో సినిమా రావడం ఖాయంలా కనిపిస్తోంది. అనిల్ చెప్పిన కథ బాగా నచ్చడంతో రామ్ కూడా ఈ సినిమా బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడట. ఇలా క్రేజీ కలయికలో మొత్తానికి త్వరలోనే ఓ ఫుల్ ఫన్ తో సాగే సినిమా రాబోతుంది అన్నమాట. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’తో అలాగే ఎఫ్ 2తో సూపర్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ.. ప్రస్తతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు