‘వకీల్ సాబ్’ షూటింగ్లో జాయిన్ అయిన ప్రముఖ హీరోయిన్

Vakeel Saab

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ చివరి షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ మొదలుకాగా పవన్ మినహా మిగతా ముఖ్య తారాగణం మొత్తం ఇందులో పాల్గొంటున్నారు. తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ నివేత థామస్ సైతం సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కోర్టు విచారణ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ నందు నివేత థామస్ కనిపించనుంది.

ముందుగా అనుకున్న తేదీ కంటే త్వరగానే పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అవుతున్నారు. వీలైనంత త్వరగా సినిమాను ముగించి విడుదలకు సిద్ధం చేయాలని టీమ్ పనిచేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ ఈఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. పవన్ సైతం ఈ చిత్రంతో మరోసారి తన స్టార్ పవర్ చూపాలని అనుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
x

Exit mobile version