మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యువ నటీనటుల్లో తన టాలెంట్ తో అమితంగా మెప్పించిన నటుడు సుహాస్ కూడా ఒకడు. పలు చిత్రాల్లో కీలక పాత్రలతో తనదైన నాచురల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న సుహాస్ ఇపుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుండగా వీటితో పాటుగా తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. కోలీవుడ్ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి నటిస్తున్న తాజా చిత్రం “మందాడి”లో తాను నటించనున్నాడు.
దీనితో తన కోలీవుడ్ డెబ్యూ పై మంచి ఆసక్తి ఇపుడు నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా సుహాస్ తో పాటుగా కట్టప్ప సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ లాంటి నటులు కూడా నటిస్తుండడం విశేషం. మరి ఇలాంటి సినిమాలో సుహాస్ కి ఎలాంటి రోల్ పడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు.