టాక్..”RRR” మళ్ళీ కొత్త డేట్ చూస్తుందా..?

Published on Oct 8, 2021 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం పలు కారణాల చేత ఎట్టకేలకు వచ్చే ఏడాది జానాతి 7న రిలీజ్ కి సన్నద్ధం అయ్యింది.

దీనిపై ఒక అధికారిక క్లారిటీ ని కూడా మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేసేసారు. కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ మారుతున్న సమీకరణాల నిమిత్తం బహుశా ఈ భారీ సినిమా మళ్ళీ ఇంకో కొత్త డేట్ కి షిఫ్ట్ అవ్వబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

అయితే అది కూడా ఎంతో దూరం కాదు అదే జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26కి విడుదల అవుతుందట.. అయితే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ ఈ గాసిప్ అయితే బయటకి వచ్చింది. మరి వాస్తవంగా ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :