టాక్..పవన్ మరోసారి షాకింగ్ డెసిషన్..?

Published on Jun 9, 2022 2:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో విలక్షణ దర్శకుడు క్రిష్ తో “హరిహర వీరమల్లు” అనే భారీ పాన్ ఇండియా చిత్రం ఆల్రెడీ షూటింగ్ లో ఉండగా దీని తర్వాత మరో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ సినిమాలతో పాటు తన రాజకీయ కార్యకలాపాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

గతంలో కూడా పవన్ ఇదే విధంగా సినిమాలు పాలిటిక్స్ చేస్తూ కొన్నాళ్ల పాటు సినిమాలు ఆపేసారు. అలాగే ఈసారి కూడా మళ్ళీ ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలు అలాగే హరీష్ తో చేయబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమా తర్వాత సినిమాలు ఆపి పాలిటిక్స్ కి పూర్తి సమయం కేటాయించాలని చూస్తున్నారట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం అయితే ఈ టాక్ బయటకొచ్చింది.

సంబంధిత సమాచారం :