పాన్ ఇండియా వైపు చూస్తున్న వరుణ్ తేజ్?

Published on Aug 29, 2021 2:01 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఘని’ సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ మెగా హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వైపు చూస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం ఓ యువ దర్శకుడితో వరుణ్ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ ఈ వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :