కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత రాఘవ లారెన్స్ దర్శకుడిగా అవతారం ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.. రాఘవ లారెన్స్ ఇతర హీరోలతో సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో తను కూడా హీరోగా సినిమాలు చేసాడు. అందులో తనకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు ‘ముని’, ‘కాంచన’.. కామెడీ హర్రర్ గా తెరకెక్కిన ఈ సినిమాలకి సీక్వెన్స్ గా ప్రస్తుతం ముని 3 సినిమా రూపొందుతోంది.
రాఘవ లారెన్స్ దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ పూర్తవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గత సినిమాల కంటే ఈ సినిమాలో ఎక్కువగా సిజి వర్క్ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.
రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ కీలాక్ పాత్రలో కనిపించనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మాత.


