సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా స్విట్జర్ ల్యాండ్ లో రెండు పాటల చిత్రీకరణ కోసం వెళ్ళిన సంగతి తెలిసినదే. ఈ సినిమాలో హీరోయిన్ అయిన తమన్నా అక్కడ మహేష్ సతీమణి నమ్రతతో, శ్రీనువైట్ల జోడీ అయిన రూప లతో స్నేహం ఏర్పరుచుకుందని సమాచారం.
ప్రస్తుతం ఆగడు సినిమా నిర్మాణాంతర దశలో వుంది. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఐటెం సాంగ్ లో శృతిహాసన్ అలరించనున్న విషయం తెలిసినదే. తమన్ సంగీతదర్శకుడు


