కొరటాల – మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమన్నా ?

కొరటాల – మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమన్నా ?

Published on Sep 27, 2018 10:20 PM IST

tamannah

రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. కాగా మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గతకొంతకాలంగా కొరటాల ప్రయత్నిస్తున్నారట.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం, కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా తమన్నాని తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నాకి సినిమాలు తగ్గాయి. ఈ సమయంలో చిరు పక్కన చేస్తే.. ఆమె కెరీర్ కి అది చాలా ప్లస్ అవుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రారంభం కాబోతోంద‌ని తెలుస్తోంది.

తాజా వార్తలు