యంగ్ హీరోయిన్స్ కి తమన్నా ఆదర్శం – మెగాస్టార్

Published on Oct 11, 2019 12:18 am IST

సైరా నరసింహారెడ్డిలో నయనతార మెయిన్ హీరోయిన్. తమన్నాది చిన్న పాత్ర ఏమో అని అనుకున్నారు అందరూ. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక.. నయనతార కంటే కూడా తమన్నాకే ఎక్కువ పేరు వచ్చింది. ఆ మాటకొస్తే మెగాస్టార్ తరువాత తమన్నా పాత్రే అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుకే తమన్నాను మెగాస్టర్ మెచ్చుకున్నారు. యంగ్ హీరోయిన్స్ అందరికీ తమన్నా ఆదర్శం అని మెగాస్టార్ అన్నారు. సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా తమన్నా పాల్గొని తన డెడికేషన్ ఏంటో నిరూపించుకుందని చిరంజీవి తెలిపారు.

కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. సినిమా రిపోర్ట్స్ ను బట్టి బ్లాక్ బస్టర్ అంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More