గ్లామర్ సీక్రెట్ చెప్పిన తమన్నా !

Published on Jun 20, 2021 7:41 pm IST

సినిమా హీరోయిన్స్‌ ముఖం పై మచ్చలు, మొటిమలు రాకుండా ఉండటానికి, వస్తే పోవడానికి ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడుతూ ఉంటారు. అయితే, తమన్నా ఏమి వాడుతుందో తెలుసా ? మొటిమలు రాకుండా నివారించడానికి తాను తన ఉమ్మిని వాడుతుందట. తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా స్కిన్‌ కేర్‌ విషయంలో నేను మార్నింగ్ సెలైవాను కూడా వాడుతాను. ఉదయాన్నే లేచిన తర్వాత నా లాలాజాలం(సలైవా)ను నా స్కిన్ పై అప్లై చేస్తాను.

ఇది చాలమందికి తెలియకపోవచ్చు. సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో చాలా బాగా పని చేస్తోంది. అందుకే నేను అది వాడతాను. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఎఫ్ 3లో వెంకటేష్ సరసన నటిస్తోంది. అలాగే ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో సినిమాలోనూ తమన్నా ఓ బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది. ఇక కెజిఎఫ్ 2 లోనూ ఆమె ఓ పాత్ర చేస్తోంది అని ప్రస్తుతం వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :