నేషనల్ లెవల్ క్రేజ్ సొంతం చేసుకునే అవకాశం దక్కించుకున్న తమన్నా

Published on Jun 24, 2021 3:01 am IST

కథానాయకిగా దక్షిణాదిన మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి తమన్నా. తెలుగులో అయితే అగ్ర కథానాయకిగా చలామణీ అయింది. మారుతున్న కాలంతో పాటు మనం కూడ మారాలి అనేది ఆమె ఫార్ములా. అందుకే కేవలం పరిమితం అయిపోకుండా వేరే దారుల్లో కూడ అడుగుల వేస్తోంది. ఓటీవల బాగా వాడకంలోకి వచ్చిన డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది తమన్నా. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఇటీవలే ‘నవంబర్ సిరీస్’ వెబ్ సిరీస్ చేసి మెప్పించిన ఈ మిల్కీబ్యూటీ తాజాగా ఇంకొక వెబ్ సిరీస్ కు సైన్ చేసింది.

ఈసారి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ కోసం చేయనున్నారట. నిర్మాత దినేష్ విజన్ దీన్ని నిర్మించనున్నారు. అరునిమ శర్మ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారు. తమన్నాతో పాటుగా ఆశిమ్ గులాటి ఇందులో లీడ్ రోల్ చేయనున్నాడు. ‘యారి’ దోస్తీ అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్. ఇది పూర్తిగా స్నేహం అనే కాన్సెప్ట్ మీద నడిచే స్టోరీ. సెప్టెంబర్ నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుకానుంది. 2022కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. ఈ వెబ్ సిరీస్ తో తమన్నాకు నేషనల్ లెవల్లో క్రేజ్ దక్కే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :