తమన్నా చాలా ఎగ్జైట్ అవుతోంది

Published on Dec 2, 2019 7:13 pm IST

స్టార్ హీరోయిన్ తమన్నా కెరీర్లో రెండో చాప్టర్ స్టార్ చేసింది. సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె చేస్తున్న డెబ్యూ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే మొదలై ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ‘నబంబర్ స్టోరీ’ అనేది ఈ వెబ్ సిరీస్ పేరు. వెబ్ సిరీస్లో నటిస్తే పాత్రలో జీవించడానికి ఆస్కారం ఉంటుందన్న మిల్కీ బ్యూటీ నిజంగానే ఆ పాత్రని ఎంజాయ్ చేస్తోంది.

తన యువ బృందం యొక్క పనితీరు పట్ల చాలా హ్యాపీగా ఉన్న అమె రెండో షెడ్యూల్ మొదలుపెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉంది. రామ్ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ను తమిళ లీడింగ్ వీక్లీ మేగజైన్ ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. హాట్ స్టార్ ద్వారా ఈ సిరీస్ ప్రసారం కానుంది. తండ్రి, కూతుళ్ల మధ్యన సాగే భావోద్వేగపూరితమైన జర్నీగా ఈ వెబ్ సిరీస్ ఉండనుంది.

సంబంధిత సమాచారం :

More