తాప్సీని నిలబెట్టింది…మరి తమన్నాకు కలిసొస్తుందా ?

Published on Oct 10, 2019 8:19 pm IST

ప్రస్తుతం తమిళంలో తమన్నా చేసిన కొత్త చిత్రం ‘పెట్రోమాక్స్‌’. తెలుగులో 2017లో వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికిది రీమేక్. తెలుగులో తాప్సీ నటించింది. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఒకరకంగా తెలుగులో తాప్సీని నిలబెట్టింది ఈ చిత్రమే అనాలి. అప్పటి వరకు వరుస పరాజయాల్లో ఉన్న ఆమెకు మళ్లీ పాజిటివ్ క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది ఈ సినిమా.

అలాంటి సినిమానే ఇప్పుడు తమన్నా రీమేక్ చేసింది. రోహిన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రేపే విడుదలకానుంది. ఈ సినిమాపైనే తమన్నా బోలెడు ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈమధ్య తమిళంలో తమన్నా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె హోప్స్ అన్నీ ఈ హర్రర్ కామెడీ చిత్రం మీదే ఆధారపడి ఉన్నాయి. మరి తాప్సీని నిలబెట్టిన ఈ చిత్రం మిల్కీ బ్యూటీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More