‘సైరా’ కోసం ప్రత్యేక నృత్యం నేర్చుకుంటున్న తమన్నా !

Published on May 28, 2018 10:11 am IST

మెగాస్టార్ చిరంజీవి ఏంటో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘సైరా’. రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటీకే కొంత షూట్ ముగించుకున్న ఈ సినిమా ‘రంగస్థలం’ సినిమా సెట్స్ లో వేస్తున్న భారీ సెట్లో షూట్ జరుపుకోనుంది. ఇకపోతే ఈ చిత్రంలో నయనతారతో పాటు మరొక స్టార్ నటి మిల్కీ బ్యూటీ తమన్నా కూడ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పాత్ర కోసం తమన్నా సుప్రసిద్ధమైన భరతనాట్యాన్ని నేర్చుకుంటున్నారట. స్వతహాగానే మంచి డాన్సర్ అయిన తమన్నా భరతనాట్యంలో ఎలా మెప్పిస్తుందో సినిమాలోనేూ రూ.200 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా విజయ్ సేతుపతి, రవి కిషన్ వంటి ఇతర తారలు కూడ పలు పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :