కొత్త దారులు వెతుకుతున్న తమన్నా.. ఈసారి ఇలా

Published on Jun 15, 2021 8:04 pm IST

కథానాయకిగా దక్షిణాదిన మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి తమన్నా. తెలుగులో అయితే అగ్ర కథానాయకిగా చలామణీ అయింది. మారుతున్న కాలంతో పాటు మనం కూడ మారాలి అనేది ఆమె ఫార్ములా. అందుకే కేవలం పరిమితం అయిపోకుండా వేరే దారుల్లో కూడ అడుగుల వేస్తోంది. ఓటీవల బాగా వాడకంలోకి వచ్చిన డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది తమన్నా. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ప్రజెంట్ వెబ్ సిరీస్ చేసే ప్రయత్నాల్లో ఉన్న దర్శక నిర్మాతలకు తమన్నా ఒక మంచి ఆప్షన్ అయింది.

ఇలా డిజిటల్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆమె ఇంకో అడుగు ముందుకువేసి బుల్లితెర మీదకు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ ‘మాస్టర్ చెఫ్’ అనే కార్యక్రమాన్ని రూపొందించనుంది. ఈ కార్యక్రమానికి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. సో.. ఇన్నాళ్లు వెండి తెర మీద సందడి చేసిన మిల్కీ బ్యూటీ ఇకపై బుల్లితెర మీద కూడ హడావుడి చేస్తుందన్నమాట.

సంబంధిత సమాచారం :