రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా అవంతిక పాత్రలో యువరాణిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
నేడు డిసెంబర్ 21న, తమన్నా పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి’ సినిమాలో తమన్నా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నారు. ‘బాహుబలి’ మూవీ యూనిట్ ఈ న్యూస్ ను కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, తమన్నాలు బుల్గేరియాలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడే తమన్నా తన పుట్టినరోజు వేడుకలలో పోల్గోననుంది.
ఈ భారి బడ్జెట్ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరకర్త. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. తమిళంలో ‘మహాబలి’గా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు.


