తమిళ తంబీలు టాలీవుడ్ పై పట్టుకోల్పాయారా?

తమిళ తంబీలు టాలీవుడ్ పై పట్టుకోల్పాయారా?

Published on Jun 3, 2019 8:56 AM IST

పోయినవారం సూర్య నటించిన “ఎన్ జి కె”, అలాగే ప్రభుదేవా,తమన్నా నటించిన “అభినేత్రి 2″ విడుదలైనాయి. ఈ రెండింటిలో ఒక్కటికూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకయాయి. గత కొన్ని సంవత్సరాలుగా తమిళ్ డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ పై తమ సత్తా చాటలేకపోతున్నాయి. దశాబ్ద కాలం వెనక్కి వెళితే తమిళ అనువాదాలు టాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్స్ తో తెలుగు పరిశ్రమపై దండయాత్ర చేశాయి. విక్రమ్”అపరిచితుడు”, సూర్య”గజినీ” రజనీకాంత్ “రోబో” ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మూవీస్ తెలుగు టాప్ హీరో ల సినిమాలను మించిన వసూళ్లు రాబట్టి గట్టిపోటీ ఇచ్చాయి.

తెలుగు ప్రేక్షకులకు ప్రాంతీయవాదం, పక్షపాతం వంటి బేధభావాలు ఉండవు, విశాల్,కార్తీ, శింబు వంటి ఓ మాదిరి రేంజ్ హీరోలకు కూడా ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ టాప్ హీరో సినిమాలకు కూడా తమిళనాడులో పెద్ద మార్కెట్ ఉండదు. గత కొన్నేళ్లుగా తమిళ మూవీస్ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. సూర్య,విక్రమ్ రజని లు సూపర్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మారడం తో పాటు, టాలీవుడ్ లోనే కొత్త డైరెక్టర్స్ ప్రయోగాత్మక మూవీస్ తీస్తూ అలరిస్తున్నారు. దానితో సౌత్ లో అలాగే జాతీయంగా తెలుగు సినిమా తన మార్కుని చూపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు