కరోనా బారిన పడి తుదిశ్వాస విడిచిన ప్రముఖ దర్శకుడు

Published on Apr 27, 2021 4:15 pm IST

కరోనా కల్లోలం సినీ ఇండస్ట్రీని వదలట్లేదు. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి గొప్ప కళాకారులు కరోనా బారినపడి కన్నుమూయగా తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు తమిర కరోనాతో మరణించారు. తమిర ప్రఖ్యాత దర్శకులు కె.బాలచందర్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేశారు. కరోనాతో కొన్నిరోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆయన.

మెల్లగా కోలుకుంటున్నారు అనేలోపే ఈరోజు ఉదయం ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. కరోనాకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమే ఆయన మరణానికి కారణమని వైద్యులు చెబుతున్నారు. తమిర 2010లో కె.బాలచందర్, భారతీరాజాలతో ‘రెట్టసూజి’ అనే సినిమాను డైరెక్ట్ చేసి దర్శకులయ్యారు. 2018లో సముతిరఖని, రమ్యపాండియన్ ప్రధాన పాత్రల్లో ‘ఆన్ దేవతై’ సినిమా చేశారు. ఈయన మృత్రి పట్ల డైరెక్టర్ శంకర్ సహా తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :