అల్లు అర్జున్ సినిమాలో తమిళ హీరోయిన్

Published on Jun 7, 2019 9:35 pm IST

లాంగ్ బ్రేక్ అనంతరం అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా రెండవ షెడ్యూల్ రెండు రోజుల క్రితమే మొదలైంది. సినిమాలోని స్టార్ కాస్టింగ్ మొత్తం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇందులో హీరో సుశాంత్ కూడా ఒక కీలక పాత్ర చేయనుండగా ఇంకొక పాత్ర కోసం తమిళ హీరోయిన్ నివేత పేతురాజ్‌ను తీసుకున్నారు దర్శక నిర్మాతలు.

ఉదయం నుండి ఈ వార్త ప్రచారంలో ఉన్నా కొద్దిసేపటిక్రితమే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడింది. నివేత మునుపు ‘చిత్రలహరి, మెంటల్ మదిలో’ వంటి చిత్రాల్లో నటించడం జరిగింది. ఇకపోతే హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే అభిమానులు బోలెడు అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

More