
మన తెలుగు వారు ప్రపంచంలోని నలుమూలల ఉన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువమందే సెటిల్ అయ్యారు. అక్కడ ఉన్న తెలుగు వారందరూ కలిసి అక్కడ వారి యోగ క్షేమాల కోసం, ఏమన్నా ఇబ్బందులు వస్తే ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంఘమే తానా అలియాస్ తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా.. ఈ తానా ని సమర్దవంతంగా నిర్వహించడం కోసం ప్రెసిడెంట్, సెక్రటరీ అని ఉన్న నాలుగు విభాగాలకు ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడిలానే అక్కడ కూడా ఓటింగ్ పద్దతి ద్వారా తానా అధ్యక్షులను ఎన్నిక చేసారు. పోట్ పోటీగా జరిగిన ఎన్నికల్ ఫలితాలు రానే వచ్చాయి. ఆ ఫలితాల వివరాలు మీ కోసం..
తానా ఎలక్షన్స్ రిజల్ట్స్ :
ప్రెసిడెంట్ : తానా ప్రెసిడెంట్ పదవి కోసం నార్త్ వర్జీనియాకి చెందిన సతీష్ వేమన – టెక్సాస్ కి చెందిన యలమంచిలి రామ్ మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో సతీష్ వేమన 8257 ఓట్లు సాధించడమే కాకుండా కాకుండా తానా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నాడు. యలమంచలి రవి 3137 ఓట్లతో సరిపెట్టుకున్నాడు.
సెక్రటరీ : సెక్రటరీ పదవి కోసం మధు టాటా – భక్త బల్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో 7039 ఓట్లు సాధించి మధు టాటా సెక్రటరీగా ఎన్నికైతే, భక్త బల్ల 4235 ఓట్లతో సరిపెట్టుకున్నాడు.
ట్రెజరర్ : ట్రెజరర్ పదవి కోసం మురళి వెన్నం – పటూరి మధ్య పోటీ నెలకొంది. అందులో మురళి వెన్నం 7187 ఓట్లను సాధించి ట్రెజరర్ పదవిని దక్కించుకోగా పటూరి 4033 ఓట్లతో సరిపెట్టుకున్నాడు.
జాయింట్ సెక్రటరీ : జాయింగ్ సెక్రటరీ పదవి కోసం రవి పొట్లూరి – బుల్లయ్య మధ్య పోటీ జరగగా, రవి పొట్లూరి 7934 ఓట్లతో జాయింట్ సెక్రటరీ పదవిని కైవశం చేసుకుంటే బుల్లయ్య 3293 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

