రానాతో జోడీ కట్టనున్న తాప్సీ?

రానాతో జోడీ కట్టనున్న తాప్సీ?

Published on Nov 5, 2015 10:27 AM IST

rana-taapse
రీసెంట్ టైమ్స్లో చాలా మంది దర్శకులు తెలుగు తెరపై రాని, చూడని కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఇండియన్ స్క్రీన్ పై రాని నేవీ, సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో రానా డబ్బుబాటి ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. 1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నంలోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసారు. ఈ వీడని మిస్టరీనే ఈ సినిమా కథాంశం. సంకల్ప్ అనే రైటర్ ఈ కథని సిద్దం చేసుకొని తనే దర్శకుడుగా ఈ సినిమా చేస్తున్నాడు.

రానా నావికా అధికారిగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం పివిపి వారు ఈ సినిమా కోసం ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో రానాకి జోడీగా సొట్ట బుగ్గల సుందరి తాప్సీని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సంకల్ప్ తాప్సీతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం గ్లామర్ ని పక్కన బెట్టి డిఫరెంట్ సినిమాలవైపు మొగ్గు చూపుతున్న తాప్సీ ఈ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలానే ఉందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘ఘజి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు