బాబాయ్ బాలయ్యకు తారక్ స్పెషల్ విషెష్.!

Published on Jun 10, 2021 10:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు తన బాబాయ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణల నడుమ ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా అనేక మంది సినీ తారలు కూడా బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

అయితే వీటన్నిటిని మించి మాత్రం తారక్ తెలిపిన శుభాభివందనాలే నందమూరి అభిమానుల్లో మరింత ఆనందం నెలకొల్పాయి. తారక్ విషెష్ తెలుపుతూ బాల బాబాయ్ జన్మదిన శుభాకాంక్షలు అంటూ మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని తారక్ తెలియజేసాడు.

దీనితో ఈ ప్రత్యేక శుభాకాంక్షలతో బాబాయ్ అబ్బాయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం బాలయ్య “అఖండ” తారక్ “RRR” అనే భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :