మార్చి నెలలో రిలీజ్ కానున్న ‘తారామణి’
Published on Feb 20, 2018 11:27 am IST

తమిళంలో విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రం ‘తారామణి’ తెలుగులో కూడ అదే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల కార్యక్రమాలన్నింటినీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి నెల మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయట. డివి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ ఆకట్టుకుంటూ సినిమాలోని కంటెంట్ మహిళల స్వేచ్ఛ, మనో భావాలు వంటి అంశాలను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేలా ఉంటుందని సూచిస్తున్నాయి. ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో, అంజలి ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ డైరెక్ట్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

 
Like us on Facebook