సెన్సేషనల్ డైరెక్టర్ ఎట్టకేలకు హింట్ ఇచ్చాడు

Published on Aug 22, 2019 10:06 am IST

మొదటి చిత్రం పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. యంగ్ కపుల్ మధ్య ఆయన నడిపిన రొమాంటిక్ డ్రామా తెలుగు జనాలకు భలే కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ హీరోగా మొదటి హిట్ అందుకున్నారు. కాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ చిత్రం తరువాత ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కించగా ఆ చిత్రం పరవాలేదనిపించింది.

ఐతే తాను ఓ ఎక్సయిటింగ్ మూవీ చేయనున్నట్లు సోషల్ మీడియా సాక్షిగా హింట్ ఇచ్చారు తరుణ్ భాస్కర్. తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా వేదికగా నిన్న త్వరలో తాను చేయబోయే చిత్ర ప్రకటన రానుంది అని చెప్పడం జరిగింది. గతంలో తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి ఈయన తాజా చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తారేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :