టీచర్స్ డే స్పెషల్: కన్నీరు పెట్టించిన “ఆచార్యదేవోభవ”..!

Published on Aug 31, 2021 11:37 pm IST

తెలుగు బుల్లితెర‌ ప్రేక్షకులకు కడుపుబ్బా కామెడీని అందిస్తున్న కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఈటీవీలో మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా రూపొందించిన స్పెషల్ ఎపిసోడ్‌కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు ప్రముఖ సింగర్ కోటి గారు గెస్ట్‌గా వచ్చారు. వచ్చీ రాగానే సుధీర్‌ని ఒకింత ఆటాడేసుకున్నాడు. ఇక చలాకీ చంటి, అదిరే అభి డ్యాన్సులు అలరించగా, హైపర్ ఆది పంచ్ డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక చివరలో ఇంద్రజ గారు లాక్‌డౌన్ కారణంగా టీచర్లు జీతాలు లేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కళ్లకు కట్టినట్టు స్కిట్ ద్వారా చూపించడం ఎమోషనల్‌గా అనిపించింది. మరీ ఈ ఫుల్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే మాత్రం టీచర్స్ డే రోజు “శ్రీదేవి డ్రామా కంపెనీని” తప్పక చూడాల్సిందే.

ప్రొమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :