కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తోన్న ‘ఆచార్య’ !

Published on Apr 10, 2021 9:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూట్ ఆలస్యం అవుతున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కచ్చితంగా పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు కూడా పెరిగాయి. దాంతో ఈ సినిమాని ఆగస్టు 12 న విడుదల చేయాలని చూస్తున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే లవ్ స్టోరీ ఏప్రిల్ 16 నుండి వాయిదా పడింది. అతి త్వరలో, టక్ జగదీష్ మేకర్స్ తమ సినిమా పోస్ట్ ఫోన్ చేయనున్నారు.

అయితే, ఆచార్య పోస్ట్ ఫోన్ అయితే.. చిరు ఫ్యాన్స్ నిరాశ చెందటం ఖాయం. ఈ సినిమాలో మెగా అభిమానులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయట. కాగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :