ఇక విజయ్ సందడి మొదలవుతుందన్నమాట !

Published on Jun 8, 2019 1:00 am IST

తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే విజయ్ దేవరకొండ చేసే హడావుడి మాములుగా ఉండదు. పూర్తిస్థాయిలో ప్రమోషన్లకు సహకరించే విజయ్ ప్రత్యేక శైలిలో తన సినిమాకు ప్రమోట్ చేసుకుంటుంటారు. ఎక్కడ సినిమా ఈవెంట్ ఏర్పాటు చేసినా వెళ్లి తన మాటల్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సినిమాకు బోలెడంత బజ్ తీసుకువచ్చేస్తాడు. అందుకే ఆయనతో సినిమా చేసే నిర్మాతలు ప్రచార కార్యక్రమాల్ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తుంటారు.

ప్రస్తుతం విజయ్ నటించిన ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు రెడీ అయింది. జూలై 26న థియేటర్లలోకి రానుంది. 50 రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే వరుస ఈవెంట్లతో విజయ్ తన అభిమానులకి మంచి కిక్ ఇవ్వడానికి రెడీ అయినట్టే. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బేస్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్, రష్మిక మందన్నలు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More