“అక్షర” టీజర్ కి డేట్ ఫిక్స్ అయింది !

Published on Jun 18, 2019 9:45 pm IST


టాలెంటెడ్ హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రగా, నూతన ద‌ర్శ‌కుడు బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సినీ మహల్ బ్యానర్ మ‌రియు సినిమా హాల్ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అక్షర”. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జూన్ 20న మధ్యాహ్నం 12 గంటలకు టీజర్ విడుదల కానుంది.

ఈ చిత్రంలో నందిత ఫిజిక్స్ లెక్చరర్ గా లీడ్ రోల్ లో కనిపించనున్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రాన్ని హాల్ బ్యానర్ ఫై అహితేజ బెల్లంకొండ, సురేష్ అల్లూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. మరి ఈ చిత్రం నందితా శ్వేతకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

ఇక ఈ సినిమాలో నటీనటులు: అభినవ్,శ్రీ తేజ్,అజయ్ ఘోష్,సంజయ్ స్వరూప్,శ్రీకాంత్ అయ్యర్,అప్పాజీ అంబరీష, మాణిక్యం రెడ్డి తదితరులు. సాంకేతిక నిపుణులు: కెమెరామన్: నగేష్ బెనెల్, మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్- జి.సత్య, నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన,దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.

సంబంధిత సమాచారం :

X
More