ఇంటెన్స్ గా అనిపిస్తున్న “లక్ష్య” టీజర్..!

Published on Jan 22, 2021 10:20 am IST

మన టాలీవుడ్ లో ఉన్న మంచి టాలెంటెడ్ అండ్ యంగ్ హీరోల్లో నాగ శౌర్య కూడా ఒకడు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా శౌర్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ యంగ్ హీరో చాలానే సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే మరి తాను నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ అండ్ ఆర్చరీ పై మొట్ట మొదటి ఇండియన్ చిత్రం “లక్ష్య” టీజర్ ను మేకర్స్ ఈరోజు నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు.

ఈ సినిమాకు గాను నాగశౌర్య చేసిన మేకోవర్ ఎంతటి హైప్ ను క్రియేట్ చేసిందో తెలిసిందే. మరి ఆ హైప్ అంతటినీ క్యాచ్ చేసే విధంగానే ఈ టీజర్ ను చూస్తే అనిపిస్తుంది. జగపతి బాబు వాయిస్ ఓవర్ లో మొదలైన ఈ టీజర్ ఆటలో చాలా మందికి గుర్తింపు వస్తే ఆటకే గుర్తింపు తెచ్చే వాడిగా నాగశౌర్య రోల్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా మొదలయ్యింది.
మరి అలాగే విలు విద్యలో ఆరితేరిన హీరో దానికి దూరం అవ్వడం మళ్ళీ తిరిగి రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావడం వంటివి మంచి ఇంటెన్స్ టేకింగ్ తో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చూపించారు. మరి అలాగే నాగ శౌర్య అయితే సరైన ఆర్చర్ లానే కాకుండా యాంగ్రీ యంగ్ మెన్ గా మరియు మంచి మేకోవర్ తో అవుట్ స్టాండింగ్ గా కనిపిస్తున్నాడు. మరి చివర్లో తాను స్పెషల్ డైట్ తీసుకొని ప్రిపేర్ చేసిన 8 ప్యాక్ లుక్ విజువల్ అయితే అదిరింది.

హీరోయిన్మ కేతిక శర్మ చిన్న బిట్ లో కనిపించినా మంచి నటనను కనబర్చింది. ఇక ఈ టీజర్ లో మరో స్పెషల్ మెన్షన్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవకు ఇవ్వాలి టీజర్ కు కట్ కు తగ్గట్టుగా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ కంపోజర్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ వేసవి కానుకగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :