తిరుమలలో “తీస్ మార్ ఖాన్” ప్రొడ్యూసర్!

Published on Jun 20, 2022 6:41 pm IST


యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ తీస్ మార్ ఖాన్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ వదలగా, ఈ వీడియోకి మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఆన్ లైన్ వేదికపై తీస్ మార్ ఖాన్ టీజర్ భారీ స్పందన తెచ్చుకొని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తమ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సినిమా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన తీస్ మార్ ఖాన్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు.

ఇటీవల వదిలిన తీస్ మార్ ఖాన్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఈ సినిమాలో హీరో ఆది సాయి కుమార్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేస్తూ ఈ వీడియో కట్ చేశారు. హీరో విభిన్న షేడ్స్ చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు. హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీంతో యూట్యూబ్‌లో ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌గా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్, ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయి కుమార్ నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు.

ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, పూర్ణ, అనూప్ సింగ్ ఠాగూర్, కబీర్ సింగ్, అర్జున్ అంబటి, ఆర్ జె హేమంత్, శ్రీకాంత్ అయ్యంగార్, అజీజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్ విజన్ సినిమాస్, డైరెక్టర్ కళ్యాణ్ జి గోగణ, ప్రొడ్యూసర్ నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తిరుమల రెడ్డి, మ్యూజిక్ సాయి కార్తీక్, ఎడిటర్ మణికాంత్, పీఆర్వో సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :