యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ప్రముఖ దర్శకుడు తేజ ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు . ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ ఫై కి వెళ్లనుంది.
ఇక ఇప్పటివరకు నటన పరంగా ఏవరేజ్ మార్కులు పడ్డ సాయి శ్రీనివాస్ కు తేజ తో సినిమా చేయటం చక్కటి అవకాశం . ఎందుకంటె తేజ దర్శకత్వంలో నటించడం కొంచం కష్టమైన పనే అయినా నటన పరంగా చాలా మెరుగుపడచ్చు ఈ విషయాన్ని హీరోలే స్వయంగా ఒప్పుకున్న సందర్భాలు వున్నాయి. మరి ఈ హీరో ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి . ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది.


