60 రోజుల్లో వెంకటేష్ సినిమా పూర్తి !

9th, December 2017 - 10:03:22 AM

వెంకటేష్, తేజ సినిమా ఈ మద్య ప్రారంభం అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కు అభినందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్ పక్కగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

టాకీ పార్ట్ మొత్తం 60 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తిసుకురానున్నారు చిత్ర యూనిట్. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా తరువాత తేజ బాలయ్య తో ఎన్టీఆర్ బయోపిక్ తియ్యబోతున్నారు. వెంకటేష్ సినిమా ను ఏప్రిల్ లో విడుదల చేసి మే నుండి బాలకృష్ణ సినిమాను చిత్రికరించబోతున్నారు తేజ.